సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనేది చాలా వాస్తవం. ఇండస్ట్రీలో తమకు ఎదురయ్యే చేదు అనుభవాల గురించి ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ బయటపెట్టారు. ఆఫర్స్ కోసం సినీరంగంలో అడుగుపెట్టినప్పుడు దర్శకనిర్మాతలు, హీరోస్, క్యారెక్టర్ ఆర్టిస్టుల నుంచి తమకు ఎదురైన కఠిన పరిస్థితుల గురించి అనేక విషయాలను.. వేధింపులు, ఒత్తిడిని ఎదుర్కొవాల్సి వచ్చినప్పటి భయంకర రోజులను గుర్తుచేసుకున్నారు. అయితే కొంత మంది తారలు ఇప్పటికీ తనకు ఎదురైన పరిస్థితుల గురించి బహిరంగంగా చెప్పడానికి భయపడుతున్నారు. ఇప్పటికే మీటూ ఉద్యమం పేరుతో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. తాజాగా మరాఠీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయి తమ్‏హంకర్ తాను ఎదుర్కొన్న అనుభవాన్ని చెప్పుకొచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న సాయి తమ్‏హంకర్ మాట్లాడుతూ.. కెరీర్ ప్రారంభంలో తనకు వచ్చిన ఫోన్ కాల్ గురించి తెలిపింది.

మిస్ మాలినికి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి తమ్‏హంకర్ మాట్లాడుతూ ఒక వ్యక్తి నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని.. సినిమా ఆఫర్ కావాలంటే రాత్రంతా సినిమా దర్శకుడు, నిర్మాతతో గడపాలని చెప్పాడని గుర్తుచేసుకుంది. “ఒక రోజు తెలియని వ్యక్తి నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఒక సినిమాలో నన్ను హీరోయిన్ గా ఎంపిక చేశారని.. కానీ అందుకు దర్శకుడు లేదా నిర్మాతతో రాత్రంతా గడపాలని అన్నాడు. అందుకు నేను రియాక్ట్ అవుతూ మీ అమ్మను ఎందుకు పంపకూడదు అని అడిగాను. అందుకు ఆ వ్యక్తి మౌనంగా ఉండిపోయాడు. దాదాపు పది సెకన్లపాటు అతడు ఏం మాట్లాడులేదు. ఆ తర్వాత నాకెప్పుడు ఫోన్ చేయకూడదని చెప్పి నేను ఫోన్ కట్ చేశాను. ఈ ఘటన తర్వాత నాకు ఇప్పటివరకు మళ్లీ అలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. మనకు సరైనది కాదని తెలిసిన విషయంపై ధైర్యంగా వాయిస్ ఇవ్వాలని నాకు అప్పుడే అర్థమయ్యింది ” అంటూ చెప్పుకొచ్చింది.

సాయి తమ్‏హంకర్ మరాఠీ కుటుంబంలో జన్మించింది. 17 ఏళ్ల వయసులోనే పలు సీరియల్స్ లో సైడ్ రోల్స్ చేసింది. ఆ తర్వాత మెల్లిగా బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు అందుకుంది. అమీర్ ఖాన్ నటించిన గజిని సినిమా జియా ఖాన్ పాత్రకు స్నేహితురాలిగా కనిపించింది. ఆ తర్వాత మరాఠీలో ఝకాస్, రీటా వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. హంటర్, లవ్ సోనియా, మిమీ చిత్రాల్లో కనిపించింది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన భక్షక్ మూవీలో పోలీసు పాత్రలో కనిపించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.