“బడ్డీ” ఎమోషనల్ యాంగిల్ చూపిస్తూ ‘ఫీల్ ఆఫ్ బడ్డీ’ (Feel of Buddy) లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. “బడ్డీ” సినిమా ఇప్పటిదాకా ఎంటర్ టైనింగ్, లవ్ అడ్వెంచర్ మూవీ అనే ఇంప్రెషన్ ఆడియెన్స్ లో ఉండగా…ఈ రోజు రిలీజ్ చేసిన సాంగ్ తో ఎమోషనల్ కంటెంట్ కూడా కథలో ఉంటుందని తెలుస్తోంది. ‘చూసాలే ఊసాలే నాలో నీ కలనే…దాచాలే దాచాలే నాలో ఆ కలనే..అంటూ సాగే ఈ పాటను హార్ట్ టచింగ్ గా కంపోజ్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిళ (Hip Hop Tamizha).

అల్లు శిరీష్ (Allu sirish), గాయత్రి భరద్వాజ్ (Gayathri bharadwaj), ప్రిషా రాజేశ్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ (studio green films) పై కేఈ జ్ఞానవేల్ రాజా (KE jnanael raja), అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 26న “బడ్డీ” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.