Yash sings Jotheyalli song for wife
Yash sings Jotheyalli song for wife

రాకింగ్ స్టార్ యష్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సాధారణ బస్ డ్రైవర్ కొడుకు, తన టాలెంట్, హార్డ్ వర్క్ తో పాన్ ఇండియా స్టార్ గా మారడం నిజంగా ప్రేరణగా చెప్పుకోవచ్చు. యష్ కెరీర్ బుల్లితెర సీరియల్స్ తో ప్రారంభమైంది. అనంతరం కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోగా నిలదొక్కుకున్నాడు. అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ సినిమాతో అతని లైఫ్ మలుపు తిరిగింది. ఆ సినిమా పెద్ద హిట్ అవడంతో కేజీఎఫ్ 2 ద్వారా మరింత ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు యష్ నటిస్తున్న టాక్సిక్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుండగా, గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా పోస్టర్లు, గ్లింప్స్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదే సమయంలో, యష్ బాలీవుడ్ రామాయణ సినిమాలో రావణుడిగా నటిస్తున్నారని సమాచారం. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయిన యష్, తన పవర్‌ఫుల్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు.

ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే, ఇటీవల యష్ తన భార్య రాధికా పండిట్ బర్త్ డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడు. ఈ వేడుకలో యష్ సింగర్ గా మారి భార్య కోసం ప్రత్యేకంగా జోతేయల్లి అనే క్లాసిక్ పాటను పాడాడు. ఈ పాటకు స్వరపరచినది ఇళయరాజా, గాయకులు S.P. బాలసుబ్రహ్మణ్యం & జానకి. ఇప్పుడు యష్ పాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

యష్ కెరీర్ పరంగా అతి జాగ్రత్తగా కొత్త ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేస్తున్నాడు. కేజీఎఫ్ తర్వాత తన రేంజ్ తగ్గిపోకుండా, భారీ బడ్జెట్ సినిమాలను మాత్రమే ఎంచుకుంటున్నాడు. ఇప్పటికే టాక్సిక్, రామాయణం సినిమాలతో బిజీగా ఉన్న యష్, మరో పాన్ ఇండియా మూవీ కోసం స్క్రిప్ట్ వింటున్నాడని టాక్. ఫ్యాన్స్ మాత్రం యష్ నుంచి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *