
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వార్ 2’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్ బాలీవుడ్‌లో నటించనుండటం, హృతిక్ రోషన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం వల్ల ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వచ్చిన ‘వార్’ సినిమా హృతిక్, టైగర్ ష్రాఫ్ నటనతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఈ సిరీస్‌లో భాగమవ్వడంతో సినిమా రేంజ్ పెరిగింది.
ఇటీవల చిత్రబృందం ఓ మాస్ సాంగ్ షూట్ చేసింది. ఇందులో ఎన్టీఆర్, హృతిక్ కలిసి స్టెప్పులేశారు. అయితే ఈ రిహార్సల్స్ సమయంలో హృతిక్ గాయపడినట్లు సమాచారం. బాలీవుడ్ వర్గాల ప్రకారం, హృతిక్ గాయపడటంతో సినిమా షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయింది. ఆయనకు చికిత్స అందించగా, వైద్యులు నెలరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో సినిమాకు సంబంధించి కొన్ని షెడ్యూల్స్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.
ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర గురించి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. హృతిక్, ఎన్టీఆర్ మధ్య ఓ పవర్‌ఫుల్ యాక్షన్ సీన్ కూడా ప్లాన్ చేశారు. ఈ సన్నివేశం సినిమాకే హైలైట్ కానుందని చిత్రబృందం చెబుతోంది.
హృతిక్ గాయంపై, సినిమా షూటింగ్ ఆలస్యం గురించి త్వరలోనే అధికారిక క్లారిటీ రానుంది. బాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాపై మరిన్ని అప్‌డేట్స్ త్వరలో వెలువడనున్నాయి.