
టాలీవుడ్ వెండితెరపై ఏం పిల్లో ఏపిల్లడో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ప్రణీత, మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. అనంతరం బావా సినిమాలో సంప్రదాయ పల్లెటూరి అమ్మాయిలా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ విజయంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ అత్తారింటికి దారేది లో ఛాన్స్ దక్కించుకుని మరింత క్రేజ్ సంపాదించుకుంది.
అయితే ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ స్టార్ స్టేటస్ అందుకోలేకపోయింది. తర్వాత బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజ్ ను వివాహం చేసుకుని సెంటిమెంట్ ఫ్యామిలీ లైఫ్ లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లిగా మారినప్పటికీ ఆమె అందం చెక్కుచెదరకుండా ఉంది. సినిమాలకు దూరమైనా, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటో షూట్స్ తో అభిమానులను అలరిస్తోంది.
తాజాగా ప్రణీత తన లేటెస్ట్ ఫోటో షూట్ తో నెట్టింట హీట్ పెంచింది. ప్రత్యేకమైన chewing gum dress లో కనిపించిన ఆమె స్టన్నింగ్ లుక్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ ఫోటోలు వైరల్ అవుతూ నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.
తల్లి అయిన తర్వాత కూడా తన అందాన్ని కాపాడుకుంటూ, ఫ్యాషన్ ఐకాన్ గా కొనసాగుతున్న ప్రణీత, త్వరలో సినిమాలకు రీఎంట్రీ ఇస్తుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!