పై ఫొటోలో కనిపిస్తోన్న బ్యూటీని గుర్తు పట్టారా? ఒకప్పుడు టాలీవుడ్‌లోని క్రేజీ హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. చాలా మందిలాగే మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత నితిన్, వేణు, నాగార్జున, జగపతిబాబు, శ్రీకాంత్ తదితర స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం వార్తల్లో ఉన్న ఓ స్టార్ హీరోతో ఈ హీరోయిన్ ప్రేమాయణం నడిపిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ కారణంగా ఈ అమ్మడికి సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఈ బ్యూటీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి సుమారు ఆరేళ్లు అవుతోంది. మరి ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే మీకో క్లూ.. ప్రస్తుతం జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ తోనే ఈ అందాల తార ప్రేమలో పడింది. అయితే అప్పటికే దర్శన్ కు పెళ్లై భార్య పిల్లలు ఉన్నారు. దర్శన్ భార్య జోక్యం చేసుకోవడంతో వీరి ప్రేమాయణానికి ఎండ్ కార్డు పడిందని టాక్. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. ఈ బ్యూటీ మరెవరో కాదు ‘నికిత తుక్రాల్’.

పేరుకు కన్నడ నటే అయినా చూడడానికి అచ్చం తెలుగమ్మాయిలా కనిపిస్తుంది నిఖిత. ఈ కారణంగానే ఆమెకు టాలీవుడ్ లో వరుసగా సినిమా అవకాశాలు దక్కాయి. ఆర్యన్ రాజేశ్ ‘హాయ్’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఆమె కళ్యాణ రాముడు, సంబరం, ఖుషీ ఖుషీగా, ఏవండోయ్ శ్రీవారు, అగంతకుడు, మహారాజశ్రీ, నీ నవ్వే చాలు, అనసూయ, భద్రాద్రితో పాటు అవును 2, టెర్రర్ తదితర సినిమాల్లో నటించింది. ఆ తర్వాత మలయాళ, తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అక్కడి ప్రేక్షకులను కూడా అలరించింది. అయితే దర్శన్ తో ప్రేమ వ్యవహారం కారణంగా ఈ అందాల తారకు సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయాయి.

 

View this post on Instagram

 

A post shared by Nikita Thukral (@nikkithukral)

ఫలితంగా ఇండస్ట్రీకి దూరమైన ఆమె ముంబైకు చెందిన గగన్ దీప్ సింగ్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. వీరికి ఓ పాప కూడా పుట్టింది. సినిమాలకు దూరమైనా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది నిఖిత. తన లేటెస్ట్ ఫొటోస్, వీడియోలను అందులో షేర్ చేస్తుంటుంది. పై ఫొటో కూడా అందులోనే. దీనిని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. కాగా నికితా 2018లో రాజసింహ అనే కన్నడ సినిమాలో నటించింది.

 

View this post on Instagram

 

A post shared by Nikita Thukral (@nikkithukral)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.