Mon. Oct 13th, 2025

భారత ఆర్చరీ సంఘం (AAI) ఆధ్వర్యంలో మొదటిసారిగా జరగనున్న ఆర్చరీ ప్రీమియర్ లీగ్(APL) అక్టోబర్ 2, 2025 సాయంత్రం 7 గంటలకు న్యూ ఢిల్లీ, ఆనంద్ విహార్‌లోని యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. ఈ చారిత్రక స్పోర్ట్స్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ చీఫ్ గెస్ట్‌గా ఈవెంట్‌కు హాజరై లీగ్‌ను ప్రారంభిస్తారు.

భారతదేశంలో ఇంతవరకు లేని విధంగా ఫ్రాంచైజీ ఆధారిత టోర్నమెంట్ రూపంలో APLను ప్రవేశపెడుతున్నారు. దేశంలోని అగ్రశ్రేణి ఆర్చర్లు, అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లతో కలిసి పోటీపడతారు. మొత్తం ఆరు జట్లతో జరగబోయే ఈ లీగ్‌లో 36 మంది భారత రికర్వ్, కాంపౌండ్ ఆర్చర్లు, అలాగే ప్రపంచ టాప్-10లో ఉన్న వారు సహా 12 మంది ప్రముఖ అంతర్జాతీయ ఆటగాళ్లు పాల్గొనబోతున్నారు.

ప్రపంచ ఆర్చరీ చరిత్రలోనే తొలిసారిగా, రికర్వ్ మరియు కాంపౌండ్ ఆర్చర్లు ఒకే జట్టుగా, ఫ్లడ్‌లైట్స్‌లో పోటీ పడే ప్రత్యేక ఫార్మాట్‌ను APLలో ప్రవేశపెడుతున్నారు. ఇది ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించాలనే లక్ష్యంతో రూపొందించబడింది. అక్టోబర్ 2 నుంచి 12 వరకు జరగనున్న ఈ టోర్నమెంట్‌కు వరల్డ్ ఆర్చరీ, వరల్డ్ ఆర్చరీ ఆసియా మరియు భారత క్రీడా మంత్రిత్వ శాఖ మద్దతు తెలిపాయి.

The submit ఆర్చరీ ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవానికి చీఫ్ గెస్ట్‌గా రామ్ చరణ్ first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.