కన్నడ స్టార్ రిషబ్ శెట్టి డైరెక్ట్ చేస్తూ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ చిత్రం ‘కాంతార చాప్టర్ 1’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 2న ఈ సినిమా వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటేందుకు రిషబ్ శెట్టి రెడీ అవుతున్నాడు.
అయితే, ఈ సినిమాకు ఏపీలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో రూ.75/-, మల్టీప్లెక్స్‌లో రూ.100/- అదనపు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ టికెట్ ధరలు అక్టోబర్ 1న స్పెషల్ ప్రీమియర్స్ మొదలుకొని అక్టోబర్ 11 వరకు అమలవుతాయని ప్రభుత్వం తెలిపింది.
ఇక ఈ టికెట్ రేట్ల పెంపుతో కాంతార చాప్టర్ 1 మేకర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించగా అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించాడు.
The publish ఏపీలో పెరిగిన ‘కాంతార చాప్టర్ 1’ టికెట్ రేట్లు.. ఎంతంటే..? first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.