టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప-2’ మరో పదిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పాటలు ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. రీసెంట్గా రిలీజ్ అయిన స్పెషల్ ఐటెం సాంగ్ ‘కిస్సిక్’ ఇన్స్టంట్ చార్ట్‌బస్టర్‌గా మారింది. ఈ పాట రిలీజ్ కావడంతోనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ట్రెండింగ్ అవుతోంది. ఇక యూట్యూబ్‌లో ఈ పాట ఏకంగా 50 మిలియన్ వ్యూస్‌తో రికార్డు క్రియేట్ చేయడమే కాకుండా నెం.1గా ట్రెండ్ అవుతోంది.
ఈ పాటలో యంగ్ బ్యూటీ శ్రీలీల అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులు వేయడంతో ఈ సాంగ్‌ను బిగ్ స్క్రీన్స్‌పై ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
The post 50 మిలియన్ వ్యూస్‌తో ‘కిస్సిక్’ సెన్సేషన్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.