టాలీవుడ్లో తెరకెక్కిన ప్రెస్టీజియస్ మూవీ ‘పుష్ప-2’ వచ్చే వారం గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే, ఇటీవల ఈ సినిమా ఈవెంట్లో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ చిత్ర నిర్మాతలపై కొన్ని కామెంట్స్ చేశాడు.
దీంతో మైత్రీ మూవీ మేకర్స్‌తో దేవిశ్రీ ప్రసాద్‌కు మనస్పర్థలు వచ్చాయని.. ఇకపై ఈ బ్యానర్లో దేవిశ్రీ ప్రసాద్ వర్క్ చేయడనే టాక్ సినీ వర్గాల్లో జోరుగా వినిపించింది. అయితే, ఇదే ప్రశ్నపై చిత్ర నిర్మాతలు తాజాగా క్లారిటీ ఇచ్చారు. ‘రాబిన్‌హుడ్’ మూవీ ప్రెస్ మీట్లో మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ రవి ఈ ప్రశ్నకు సమాధానంగా.. దేవిశ్రీ మాట్లాడిన మాటల్లో ఎలాంటి తప్పు లేదు. ప్రేమ ఉన్న చోటే కంప్లెయింట్స్ ఉంటాయి. భవిష్యత్తులోనూ దేవిశ్రీ ప్రసాద్‌తో ప్రాజెక్ట్స్ చేస్తాం.. అంటూ ఆయన బదులిచ్చారు.
ఈ స్టేట్మెంట్తో దేవిశ్రీ – మైత్రీ మధ్య చెలరేగిన వివాదానికి ఫుల్స్టాప్ పడిందని సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఇక పుష్ప-2 ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్ అందరూ పాల్గొనేందుకు రెడీ అవుతున్నారు.
The post మైత్రీ వర్సెస్ దేవిశ్రీ.. శుభం కార్డు పడినట్లేనా..? first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.