“మ్యాడ్ స్క్వేర్” సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని ఏఎంబీ మాల్లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో సినీ అభిమానుల సమక్షంలో ట్రైలర్‌ను విడుదల చేశారు. “మ్యాడ్” సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా, ముందే భారీ అంచనాలను ఏర్పరుచుకుంది.
ట్రైలర్‌ను గమనిస్తే, ఇది పూర్తి వినోదాత్మకంగా ఉండేలా దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా, హాస్యాస్పదమైన డైలాగులు, విచిత్రమైన కామెడీ సన్నివేశాలు,Situational Humor ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. “మ్యాడ్” కంటే రెట్టింపు ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. తమన్ అందించిన Background Music ట్రైలర్‌కు ప్రధాన బలంగా నిలిచింది. ఇక భీమ్స్ సిసిరోలియో అందించిన పాటలు ఇప్పటికే Chartbusters గా నిలిచాయి.
ఈ సినిమాలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీరి మధ్య Timing Comedy, Screen Presence ప్రేక్షకులను మెప్పించేలా ఉన్నాయనిపిస్తోంది. దర్శకుడు కళ్యాణ్ శంకర్ తన సిగ్నేచర్ స్టైల్‌ను కొనసాగిస్తూ, ఈ సీక్వెల్‌ను మరింత నవ్వుల పండుగగా మలిచారు.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మించిన ఈ చిత్రం 2025, మార్చి 28న థియేటర్లలో విడుదల కానుంది. “మ్యాడ్” చిత్రానికి వచ్చిన ఆదరణను దృష్టిలో ఉంచుకుని, ఈ సినిమా కూడా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందనే ఆశతో చిత్ర యూనిట్ ఉంది.