Roti Kapda RomanceMovie Review in Telugu

విడుదల తేదీ : నవంబర్ 28, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : సందీప్ సరోజ్, సుప్రాజ్ రంగ, తరుణ్ పొనుగంటి, హర్ష నర్రా, సోనియా ఠాకూర్, మేఘ లేఖ, నువేక్ష, ఖుష్బూ చౌదరి తదితరులు.

దర్శకుడు : విక్రమ్ రెడ్డి

నిర్మాతలు : సృజన్ కుమార్, బెక్కం వేణు గోపాల్

సంగీత దర్శకుడు : సన్నీ ఎం ఆర్, హర్ష వర్ధన్ రామేశ్వర్, ఆర్ ఆర్ ధృవన్

సినిమాటోగ్రఫీ : సంతోష్ రెడ్డి

సంబంధిత లింక్స్: ట్రైలర్

ఈ వారం థియేటర్స్ లోకి రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో ఓ యూత్ ఫుల్ రొమాంటిక్ సినిమా “రోటీ కపడా రొమాన్స్” కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ఇక కథ లోకి వస్తే.. తమ చిన్ననాటి నుంచే ప్రాణ స్నేహితులు నలుగురు రాహుల్(సందీప్ సరోజ్), విక్కీ(సుప్రాజ్ రంగ) అలాగే సూర్య(తరుణ్ పొనుగంటి), హర్ష(హర్ష నర్రా) కాగా ఎప్పుడు కలిసే ఉంటూ లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటారు. అయితే వీరి హ్యాపీ లైఫ్ లోకి వచ్చిన నలుగురు అమ్మాయిలు ప్రియా(సోనియా ఠాకూర్), శ్వేత(మేఘ లేఖ) అలాగే దివ్య(నువేక్ష), సోనియా(ఖుష్బూ చౌదరి) మూలాన ఎలా వారి లైఫ్ లు టర్న్ అయ్యాయి. వీరంది ప్రేమ కథల తాలూకా సారాంశం ఏంటి? చివరికి వీరి కథలు ఎలా ముగుస్తాయి అనేది తెరపై చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

ఇప్పటి వరకు మన తెలుగు సినిమాలో చాలా యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ అలాగే ఓ నలుగురు ఫ్రెండ్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన డీసెంట్ చిత్రాల్లో దీనిని కూడా చేర్చవచ్చు అని చెప్పాలి. ముఖ్యంగా దర్శకుడు మెయిన్ లీడ్ లో నాలుగు ఫ్రెండ్స్ కథని వారి పాత్రలని బాగా, పర్ఫెక్ట్ గా తీర్చిదిద్దడం బాగుంది. అలాగే ఆ రోల్స్ లో ప్రతీ ఒక్కరు సెట్ అయ్యి వారి పాత్రలకి నలుగురు యువ హీరోలు కూడా న్యాయం చేకూర్చారు.

వీరి నలుగుర్ని తెరపై చూస్తున్నపుడు డెఫినెట్ గా ఓ బ్యాచ్ ఫ్రెండ్స్ తమని వారిలో చూసుకున్నట్టు అనిపించవచ్చు. మరి వీరిపై మాత్రం దర్శకుడు ఫ్రెండ్షిప్ అనే బ్యూటిఫుల్ ఎమోషన్ బాగా చూపించారు. అలాగే వీరితో పాటుగా వీరికి జోడిగా నటించిన యువ హీరోయిన్స్ కూడా అందరూ తమ నటన వారికి ఏవైతే పాత్రలు ఇవ్వబడ్డాయి వాటిలో తాము పర్ఫెక్ట్ గా సెట్ అయ్యి వాటిని రక్తి కట్టించారని చెప్పాలి.

ఈ మెయిన్ లీడ్ అంతా మాత్రం పెర్ఫామెన్స్ పరంగా మంచి ఎమోషన్స్ కామెడీ టైమింగ్స్ అలాగే సినిమాలో పరిస్థితిని బట్టి పలికించిన హావభావాలు బాగా ఇచ్చారు. ఇంకా సినిమాలో విక్కీ శ్వేతా ట్రాక్ అలాగే సూర్య దివ్య ట్రాక్ లు ఇంప్రెసివ్ గా ఉన్నాయని చెప్పొచ్చు. వీటిని దర్శకుడు బాగా రాసుకున్నారు. అలాగే సినిమా ఎండింగ్ కూడా వీరిపై బాగుంది. ఇంకా ప్రేమ కథల విషయంలో ఎవరినీ నిందించడానికి లేదు పరిస్థితులు కారణం అని చెప్పే ఎండింగ్ ఇంప్రెసివ్ గా ఉంది.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలో లోటు పాట్లు కూడా చాలానే ఉన్నాయి. మెయిన్ లీడ్ లో మొత్తం నాలుగు లవ్ ట్రాక్ లు ఉంటే వాటిలో రెండు మాత్రం చాలా వీక్ గా లాజిక్ లెస్ గా అనిపిస్తాయి. సోనియా అలాగే హర్ష ఇంకా రాహుల్ ప్రియా ల లవ్ ట్రాక్ లలో సోనియా – హర్ష ట్రాక్ ఒకింత ఎబ్బెట్టుగా లాజిక్ లేకుండా అనిపిస్తుంది.

అలాగే రాహుల్, ప్రియా ట్రాక్ అయితే చాలా రెగ్యులర్ గా అమ్మాయి సైడ్ నుంచి ఒక రొటీన్ ఎమోషనల్ కారణం వంటివి సినిమాలో బాగా బలహీనంగా అనిపిస్తాయి. అలాగే వీరి ట్రాక్ లకి ముగింపులు కూడా అంత ఎమోషనల్ గా అనిపించవు. ఇంకా ఓ సీన్ లో అయితే ఇండియా లోని యూఎస్ లో కూడా ఉదయాన్నే చూపించడం టెక్నికల్ ఎర్రర్ అని చెప్పొచ్చు.

అలాగే లిప్ లాక్ సీన్స్ వంటివి అలాగే కొన్ని బోల్డ్ డైలాగ్స్ ఫ్యామిలీ ఆడియెన్స్ కి కొంచెం ఎబ్బెట్టుగా అనిపించవచ్చు. అలాగే అందరి జోడీలు కూడా తెరపై బాగున్నాయి కానీ సందీప్ సరోజ్, సోనియా ఠాకూర్ ల జోడి మాత్రం అంత పర్ఫెక్ట్ గా అనిపించలేదు. ఇంకా కొన్ని సీన్స్ కథనం అయితే చాలా రొటీన్ గా ఊహాజనితంగానే అనిపిస్తాయి.

సాంకేతిక వర్గం:

చిన్న సినిమానే అయినా నిర్మాతలు మాత్రం సాలిడ్ నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని చెప్పాలి. పరిస్థితికి కావాల్సిన రిచ్ నెస్ సినిమాలో కనిపిస్తుంది. అలాగే సాంకేతిక టీంలో సన్నీ ఎం ఆర్, హర్ష వర్ధన్ రామేశ్వర్ అలాగే ఆర్ ఆర్ ధృవన్ ల స్కోర్, పాటలు బాగానే ఉన్నాయి. అలాగే సంతోష్ రెడ్డి సినిమాటోగ్రఫి కూడా బాగుంది. ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్ గా చేయాల్సింది.

ఇక దర్శకుడు విక్రమ్ రెడ్డి విషయానికి వస్తే.. తాను ప్రేమ, స్నేహం అనే రెండు బ్యూటిఫుల్ ఎమోషన్స్ ని తీసుకున్నారు. అయితే వీటిలో ఫ్రెండ్షిప్ ని మాత్రం పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేసారని చెప్పాలి. తన కామెడీ రైటింగ్ పలు డైలాగ్స్ అలాగే నటీనటుల నుంచి మంచి నటనలను రాబట్టారు. కాకపోతే తన లవ్ స్టోరీ ట్రాక్ లు ఇంకొంచెం బెటర్ గా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. కొన్ని ట్రాక్స్ ని అయితే యూత్ విజిల్ కొట్టేలా డిజైన్ చేస్తే కొన్ని పేలవంగా అనిపిస్తాయి. ఓవరాల్ గా తన దర్శకత్వం సినిమాకి పర్వాలేదు.

తీర్పు:

ఇక మొత్తానికి చూసినట్టు అయితే ఈ “రోటీ కపడా రొమాన్స్” ని ఒక బ్యాచ్ ఆఫ్ ఫ్రెండ్స్ అయితే చూసేందుకు డీసెంట్ గా ఉంటుంది అని చెప్పొచ్చు. మెయిన్ లీడ్ అంతా మంచి నటన కనబరిచారు. అలాగే కొన్ని ట్రాక్స్ అయితే యువతకి బాగా కనెక్ట్ కావచ్చు. కాకపోతే ఫ్రెండ్షిప్ ని బాగా ప్రెజెంట్ చేసిన దర్శకుడు లవ్ ట్రాక్ ని కూడా ఇంకా బెటర్ గా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. వీటితో ఈ చిత్రం కొంచెం రొటీన్ గానే అనిపించినా పర్వాలేదనిపిస్తుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *