రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘క’ ! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ‘క’. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కాబోతుంది. ఐతే, అక్టోబర్ 31, 2024న ఈ సినిమా థియేటర్స్ లోకి రానుందని మేకర్స్ ఇటీవల సోషల్ మీడియాలో ప్రకటించారు. ఇప్పుడు తాజాగా అదే విడుదల తేదీ అని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అన్నట్టు ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన బ్యానర్ Wayfarer Films పై మలయాళంలో ‘క’ను విడుదల చేయబోతున్నాడు.

కాగా ‘క’ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకం మీద చింతా గోపాలకృష్ణ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతుంది. దర్శక ద్వయం సుజీత్, సందీప్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మరి గ్యాప్ తర్వాత కిరణ్ అబ్బవరం తన మొదటి పాన్-ఇండియన్ చిత్రం ‘క’తో రాబోతున్నాడు. విజయం సాధిస్తాడో లేదో చూడాలి.

The post రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘క’ ! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *