మన తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి యంగ్ అండ్ వెర్సటైల్ నటుల్లో తన నటనతో ఎంతగానో మెస్మరైజ్ చేసిన నటుడు సత్యదేవ్ కూడా ఒకరు. మరి సత్యదేవ్ హీరోగా దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమే “జీబ్రా”. మరి డీసెంట్ బజ్ నడుమ వచ్చిన ఈ చిత్రాన్ని ఎలాగైనా థియేటర్స్ లోనే తీసుకొని రావాలి మేకర్స్ ముఖ్యంగా హీరో పట్టుబట్టి ఈ చిత్రాన్ని థియేటర్స్ లో రిలీజ్ కి తీసుకురాగా థియేటర్స్ లో ఈ చిత్రం సాలిడ్ రెస్పాన్స్ ని అందుకుంది అని చెప్పాలి.
మరి డే 1 నుంచే మంచి బుకింగ్స్ అండ్ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం ఇపుడు మొదటి రోజు కంటే ఎనిమిదవ రోజునే ఎక్కువ వసూళ్లు అందుకున్నట్టుగా చెబుతున్నారు. దీనితో మొత్తం 8 రోజుల్లో ఈ చిత్రం 9.43 కోట్ల గ్రాస్ ని అందుకొని అదరగొట్టింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించగా సత్యరాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
#zebra pic.twitter.com/WUKRf1kN7Q
— Satya Dev (@ActorSatyaDev) November 30, 2024
The post “జీబ్రా” సాలిడ్ వసూళ్ళు.. డే 1 కంటే డే 8 ఎక్కువ.. first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.