జాన్వీకి బొత్తిగా బాలీవుడ్ కలిసి రావడం లేదు. దడక్ తర్వాత హిట్ మొహమే చూడలేదు. ఇక స్టార్ కిడ్స్‌కు అండగా నిలిచే కరణ్ జోహార్ కూడా జానూకు హ్యాండిచ్చాడట. 2008లో ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దోస్తానా తెరకెక్కించాడు కరణ్. అభిషేక్, జాన్ అబ్రహం, ప్రియాంక చోప్రా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే 2019లో సీక్వెల్ ప్లాన్ చేశాడు ఫిల్మ్ మేకర్. కార్తీక్ ఆర్యన్, జాన్వీ, లక్ష్య హీరో హీరోయిన్లుగా ఫిక్సయ్యారు కూడా. కానీ కరణ్- కార్తీక్ ఆర్యన్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఈ సినిమాతోనే లక్ష్యను ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాడు కరణ్.
Additionally Learn : KATTALAN : అంటోని వర్గీస్ పెపే మాస్ అవతార్ “కాటాలన్” ఫస్ట్ లుక్ రిలీజ్
దోస్తానా2 ప్రాజెక్ట్ ఆగిపోయింది అనుకున్న టైంలో మళ్లీ పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు కరణ్ జోహార్. అయితే కార్తీక్ ప్లేసులోకి విక్రాంత్ మాస్సేను పట్టుకొచ్చిన కరణ్. హీరోయిన్ కోసం జాన్వీ ప్లేసులోకి శ్రీలీలను రీప్లేస్ చేయబోతున్నాడన్నది లేటెస్ట్ బజ్. అనురాగ్ బసు దర్వకత్వంలో తెరకెకక్కుతోన్న రొమాంటిక్ లవ్ స్టోరీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది శ్రీలీల. ఈ సినిమా దీపావళికి రిలీజ్ కావాల్సి ఉండగా ఇంకా షూటింగ్ కంప్లీట్ కాలేదు. బాలీవుడ్‌లో తల్లి శ్రీదేవిలా పేరు తెచ్చుకోవాలని శత విధాలా ప్రయత్నాలు చేస్తున్న జాన్వీ కపూర్ ప్రణాళికలన్నీ బెడిసికొడుతన్నాయి. ఫస్ట్ ఫిల్మ్ దడక్ తర్వాత బీటౌన్‌లో ఆ రేంజ్ హిట్ చూడలేదు. ఈ ఏడాది మూడు సినిమాలొచ్చాయి.. కానీ ఏ ఒక్కటి ఆడియన్స్ కు రీచ్ కావడం లేదు. పరమ్ సుందరి బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడితే.. హౌంబౌండ్ ఎప్పుడొచ్చిందో లేదో కూడా తెలియదు. ఇక సన్నీ సంస్కారీ తులసి కుమారి బాగున్నా కాంతార చాప్టర్ వన్ దెబ్బేసింది. మరీ నెక్ట్స్ జాన్వీని ఆదుకునేది తెలుగు సినిమా పెద్దియేనా…?