బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ లగ్జరీ లైఫ్ గురించి విన్నవారెవరికైనా ఆశ్చర్యం కలగకుండా ఉండదు. వయసు కేవలం 27 సంవత్సరాలు మాత్రమే అయినా, ఆర్యన్ ఇప్పటికే సుమారు రూ.80 కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్నాడని సమాచారం. తండ్రి షారూఖ్ ఖాన్ ఆస్తులను పక్కనపెడితే, స్వయంగా తన కృషితోనే ఈ స్థాయిలో సంపాదించాడని చెబుతున్నారు. ఇటీవలే ఆయన ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ అనే వెబ్ సిరీస్ ద్వారా దర్శకుడిగా మారి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ప్రాజెక్ట్‌తో పాటు పలు అంతర్జాతీయ బ్రాండ్లకు ప్రమోటర్‌గా వ్యవహరించడం వల్ల ఆయన ఆదాయం మరింత పెరిగిందట.
Additionally Learn : Deepika Padukone: ఇండియాలో ఫస్ట్ మెంటల్ హెల్త్ అంబాసిడర్ గా ఎంపికైనా దీపికా
సోషల్ మీడియాలో కూడా ఆర్యన్‌కి బోలెడంత క్రేజ్ ఉంది. స్టైలిష్ లుక్స్, ఫ్యాషన్ సెన్స్‌తో యువతలో ఐకాన్‌గా నిలిచాడు. ఆయన దగ్గర ఉన్న లగ్జరీ కార్ల లిస్ట్, డిజైనర్ దుస్తులు, ఖరీదైన వాచ్‌లు, పార్టీలు అన్నీ స్టార్ లెవెల్లోనే ఉంటాయి. కేవలం పేరు, గ్లామర్‌తో కాకుండా, ఆర్యన్ తనకు ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. తండ్రి షారూఖ్ ఖాన్ ప్రభావం ఉన్నా, తన కెరీర్లో స్వతంత్రంగా ఎదగాలని ఆయన చూపిస్తున్న పట్టుదల అభిమానులను ఆకట్టుకుంటోంది. చిన్న వయసులోనే ఇంత పెద్ద సంపాదన, ఇంత గ్రాండ్ లైఫ్ అంటే నిజంగా ఆశ్చర్యమే. ఆర్యన్ భవిష్యత్తులో నటుడిగా కూడా రానున్నాడన్న టాక్ బాలీవుడ్లో బలంగా వినిపిస్తోంది.