Mon. Oct 13th, 2025
Tollywood : టాలీవుడ్‌లోకి మరో సీనియర్ హీరోయిన్ రీ – ఎంట్రీ

సెకండ్ ఇన్నింగ్స్‌లో టాలీవుడ్‌లో పాతుకుపోవాలని సీనియర్ భామలు జెనీలియా, లయ, అనితా, అన్షు చేసిన ప్రయత్నాలు వృధాగా మారాయ్. మన్మధుడు బ్యూటీ అన్షు మజాకాతో రీ ఎంట్రీ ఇస్తే డైరెక్టర్ వల్గర్ కామెంట్లకు బలవ్వడంతో పాటు బొమ్మ కూడా బోల్తా కొట్టడంతో మళ్లీ తెలుగు ఇండస్ట్రీ వైపు తొంగి చూడలేదు అన్షు. హాసినీ అలియాస్ జెనీలియా జూనియర్‌పై ఎన్నో హోప్స్ పెట్టుకుంటే నో యూజ్. తమ్ముడు నితిన్‌ను నమ్ముకుని వచ్చిన అక్క లయ డిజాస్టర్ చూసింది. ఇక నువ్వు నేను ఫేం అనిత సుహాస్ ఓ భామ అయ్యో రామలో నటించిందన్న విషయం చాలా కొద్ది మందికే తెలుసు. ఇలా నలుగురు సీనియర్ భామలకు రీ ఎంట్రీ అచ్చి రాలేదు. కానీ ఇప్పుడు మరో సీనియర్ బ్యూటీ కామ్నా జెర్మలానీ పదేళ్ల తర్వాత టాలీవుడ్ గుమ్మం టచ్ చేయబోతుంది.

Additionally Learn : Bollywood : పరమ్ సుందరికి బాలీవుడ్ అంతగా కలిసి రావడం లేదు

కామ్నా జెఠ్మలానీ వన్స్ ఆపాన్ ఎ టైమ్ చబ్బీ హీరోయిన్. 2005లో ప్రేమికులు చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ గోపిచంద్ రణంతో ఫేమ్ తెచ్చుకుంది. ఈ సినిమాతో ఆమె కెరీర్ ఎక్కడికో వెళ్లిపోతుంది అనుకుంటే.. చప్పగానే సాగింది. మహేష్ బాబుతో సైనికుడులో ఓరుగల్లుకే పిల్ల సాంగ్‌లో ఆడిపాడిన కామ్నా ఫిల్మోగ్రఫీ చూస్తే బెండు అప్పారావు, కత్తి కాంతారావు తప్ప మిగిలినవీ చెప్పుకోదగ్గ సినిమాలేవీ కావు. కన్నడ, తమిళం, మలయాళంలో సినిమాలు చేసినా సరైన గుర్తింపు దక్కలేదు. ఇక కెరీర్ డల్ అవుతున్న టైంలో 2014లో పెళ్లి చేసుకొని ఆల్మోస్ట్ ఇండస్ట్రీ నుండి క్విట్ అయ్యింది  తెలుగులో చంద్రిక తర్వాత కనిపించని కామ్నా పదేళ్ల తర్వాత రీ ఎంట్రీకి రెడీ అయ్యింది. కిరణ్ అబ్బవరం కె ర్యాంప్‌లో ఈ సీనియర్ బ్యూటీ, కీ రోల్ ప్లే చేస్తోంది. దీపావళి కానుకగా అక్టోబర్ 18న థియేటర్లలోకి రాబోతోంది కె ర్యాంప్. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకుడు. మరి తొలి ఇన్నింగ్స్‌లో స్టార్ హీరోయిన్ హోదాను మిస్ అయిన కామ్నా సెకండ్ ఇన్నింగ్స్‌లోనైనా ఛాన్సులు కొల్లగొడుతుందేమో చూద్దాం.