Rishab Shetty : కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతార చాప్టర్ 1 మంచి హిట్ అయింది. కాంతారకు మించి ఈ చాప్టర్ 1కు కలెక్షన్లు వస్తున్నాయి. ఈ సందర్భంగా రిషబ్ శెట్టి వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ‘కొన్ని కథలకు సెట్స్ లో తెరకెక్కించడం ఇబ్బంది అవుతుంది. కానీ కాంతార చాప్టర్ 1 మాత్రం కథ రాస్తున్నప్పుడే చాలా ఇబ్బందులు అనిపించాయి. కానీ ప్రేక్షకులు ఇస్తున్న సపోర్ట్ ను గుర్తు చేసుకుని ఇది ఒక బాధ్యత అనుకుని పూర్తి చేశాం. ఎన్నో ఇబ్బందులు వచ్చినా సరే వెనకడుగు వేయలేదు మేం అని తెలిపాడు రిషబ్.
Learn Additionally : Spirit : స్పిరిట్ ఇంకెప్పుడు.. ఏంటి వంగా భయ్యా ఇది..
అన్ని అడ్డంకులు దాటుకుని సినిమా తీస్తే మంచి హిట్ అయింది. నేను తర్వాత జై హనుమాన్ సినిమాలో నటిస్తున్నాను. అది వచ్చే జనవరి నుంచి సెట్స్ మీదకు వెళ్తుంది. దాని తర్వాత మళ్లీ నేను డైరెక్ట్ చేసే సినిమా వస్తుంది. దానికి ఇంకో రెండేళ్లు పడుతుంది. చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. వాటన్నింటినీ ఒక్కొక్కటిగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఏ సినిమా చేసినా సరే ప్రేక్షకులను మెప్పించాలనే ఉద్దేశమే నాకు ఉంటుంది అని తెలిపాడు రిషబ్ శెట్టి. జై హనుమాన్ మూవీ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వస్తున్న సంగతి తెలిసిందే.
Learn Additionally : Nadiya : 12వ తరగతిలోనే ప్రేమలో పడ్డా.. పవన్ అత్త నదియా కామెంట్స్