లేటెస్ట్ గా పాన్ ఇండియా లెవెల్లో సాలిడ్ వసూళ్లతో దూసుకెళ్తున్న అవైటెడ్ కన్నడ చిత్రమే కాంతార చాప్టర్ 1. దర్శకుడు నటుడు రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ సాలిడ్ యాక్షన్, డివోషనల్ డ్రామా అంచనాలు అందుకొని కన్నడ పరిశ్రమ దగ్గర మరో భారీ గ్రాసర్ గా అయితే నిలిచింది. ఇక ఆల్రెడీ 500 కోట్ల మార్క్ ని దాటేసిన ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ వైడ్ మరో భారీ మార్క్ పై కన్నేసినట్టు ట్రేడ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది.
దీని ప్రకారం ట్రేడ్ పండితులు కాంతార 1 ఫైనల్ రన్ లో 700 కోట్ల గ్రాస్ దగ్గరకి వెళ్లొచ్చని అభిప్రాయ పడుతున్నారు. దీనితో మిగతా కొన్ని రోజుల్లో ఈ సినిమా ఇంకా 150 కోట్లకి పైగానే రాబట్టాల్సి ఉందని చెప్పాలి. మరి ఇదే జరిగితే కన్నడ సినిమా దగ్గర కేజీయఫ్ 2 తర్వాత కాంతార 2 బిగ్గెస్ట్ రికార్డుతో నిలుస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.
The publish ‘కాంతార’ టార్గెట్ 700 కోట్లు? first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.