Mon. Oct 13th, 2025
Kiran Abbavaram : ఆ హీరోను అవమానించడం కరెక్ట్ కాదు : కిరణ్‌ అబ్బవరం

Kiran Abbavaram : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం కె ర్యాంప్. జైన్స్ నాని డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఫుల్ బోల్డ్ ట్రాక్ లో వస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ లో లిప్ లాక్ లు, బూతులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమా ఈ నెల 18న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ వరుస ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. తాజాగా ప్రెస్ మీట్ లో కిరణ్ అబ్బవరంకు ఓ ప్రశ్న ఎదురైంది. మీరు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చారు. స్టార్ అయ్యేందుకు కష్టపడుతున్నారు.. బ్యాక్ గ్రౌండ్ లేకుండా సాధ్యమే అంటారా అని ప్రశ్నించింది ఓ లేడీ రిపోర్టర్.

Learn Additionally : Rishab Shetty : జై హనుమాన్ సినిమాపై రిషబ్ క్లారిటీ.. రెండేళ్లు అంటూ..

దీనిపై కిరణ్‌ స్పందిస్తూ.. మీరు ఇలాంటి ప్రశ్నలు నన్ను ఎన్ని అయినా అడగండి పర్లేదు. నేను వాటికి సమాధానం చెబుతాను. కానీ ఇతర రాష్ట్రాల నుంచి ఒక హీరో వస్తే.. అతన్ని పట్టుకుని నీ ముఖం బాగా లేదు అని చెప్పకండి. అది విని నాకే చాలా బాధగా అనిపించింది అంటూ కిరణ్‌ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. రీసెంట్ గా పక్క రాష్ట్రం నుంచి వచ్చిన ఓ హీరోను ఇంటర్వ్యూలో ముఖం బాగా లేదు.. నువ్వు ఎలా హీరో అయ్యావ్ అంటూ ఓ రిపోర్టర్ ప్రశ్నించడం పెద్ద దుమారం రేపింది. దానిపై ఇలా రియాక్ట్ అయ్యాడు కిరణ్‌ అబ్బవరం.

Learn Additionally : Srikanth Bharat : క్షమాపణలు చెప్పిన నటుడు శ్రీకాంత్ అయ్యంగార్