రెబెల్ స్టార్ ప్రభాస్ (Rebel star Prabhas) కల్కి (Kalki 2898AD) సినిమా మరో హిస్టారిక్ రికార్డ్ కు చేరువైంది. ఈ సినిమా 1000 కోట్ల రూపాయల మార్క్ కు అతి దగ్గరలో ఉంది. ప్రస్తుతం ఈ మూవీకి వరల్డ్ వైడ్ గా 950 కోట్ల రూపాయల కలెక్షన్స్ దక్కాయి. మరో 50 కోట్ల రూపాయలు దక్కితే వెయ్యి కోట్ల సినిమాగా రికార్డ్ క్రియేట్ చేస్తుంది కల్కి.

ప్రభాస్ కు బాహుబలి తర్వాత మళ్లీ ఆ ఫీట్ అందించిన చిత్రంగా కల్కి నిలవనుంది. ఓవర్సీస్ లో 16 మిలియన్ డాలర్స్ వసూళ్లు అందుకున్న కల్కి బాలీవుడ్(Bollywood)లో 200 కోట్ల రూపాయలు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లోనూ రికార్డ్ స్థాయి వసూళ్లు దక్కుతున్నాయి. కల్కి రిలీజైన 11 రోజుల్లో ఇంత సెన్సేషన్ క్రియేట్ చేయడం విశేషం.