Mon. Oct 13th, 2025
Shiva : నాగార్జున ’శివ’ రీ రిలీజ్ డేట్ వచ్చేసింది..

Shiva : నాగార్జున, అమల జంటగా ఆర్జీవీ డైరెక్షన్ లో వచ్చిన ఎవర్ గ్రీన్ మూవీ శివ. 1989 అక్టోబర్‌ 5న రిలీజైన ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్ చేసింది. ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమా ఎలా బోల్డ్ ట్రెండ్ ను క్రియేట్ చేసిందో.. అప్పట్లో శివ మూవీ యాక్షన్ ను మరో లెవల్ కు తీసుకెళ్లింది. ఈ సినిమాతోనే సైకిల్ చైన్లు పట్టుకోవడం యూత్ కు ఓట్రెండ్ అయిపోయింది. గల్లా ఎగరేసి చేతిలో సైకిల్ చైన్ పట్టుకుని ఫైట్ చేసే సీన్లకు యూత్ పిచ్చెక్కిపోయారు. నాగార్జున కెరీర్ కు ఈ సినిమా బిగ్గెస్ట్ బూస్ట్ అయింది.

Learn Additionally : Bigg Boss 9 : తప్పు చేశాం.. పచ్చళ్ల పాప రమ్య మోక్ష కామెంట్స్

ఈ మూవీ వచ్చి 35 ఏళ్లు అవుతున్న సందర్భంగా మూవీ రీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. నవంబర్ 14న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు టికెట్లు ఉండవని.. ఫ్రీగా ప్రదర్శిస్తారనే ప్రచారం జరుగుతోంది. దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక శివ మూవీకి సంబంధించిన చాలా విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆర్జీవీ ఈ సినిమాను బాలీవుడ్ లో కూడా తీసి అక్కడ కూడా బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్లు చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

Learn Additionally : Fauji : ఫౌజీ రిలీజ్ డేట్ పై వార్తలు.. నిజమేనా..?