Mon. Oct 13th, 2025
Bigg Boss 9 : బిగ్ బాస్ లో నా తడాఖా చూపిస్తా.. దివ్వెల మాధురి ఎంట్రీ..

Bigg Boss 9 : బిగ్ బాస్-9లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలు వచ్చేశాయి. ఈ వారం వైల్డ్ కార్డు ద్వారా ఐదుగురు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో అందరి చూపు దివ్వెల మాధురిపైనే ఉంది. ఆమె సోషల్ మీడియాలో ఎంత కాంట్రవర్సీ అయిందో మనకు తెలిసిందే. ఏపీ రాజకీయాల్లో ఆమె పేరు మార్మోగిపోయింది. అలాంటి మాధురి తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమె స్పెషల్ వీడియోను ప్లే చేశారు. ఆమె మాట్లాడుతూ.. నేను ఎవరికైనా ఎదురెలితే వారికే రిస్క్.. నాకు ఎవరైనా ఎదురొస్తే వారికే రిస్క్ అంటూ తెలిపింది.

Learn Additionally : Shiva : నాగార్జున ’శివ’ రీ రిలీజ్ డేట్ వచ్చేసింది..

నాకు బిగ్ బాస్ లోకి రావడం అంటే ఇష్టం లేదు. కాకపోతే నా ఫ్యాన్స్ అందరూ బిగ్ బాస్ లోకి వెళ్లమని అడిగితే వాళ్ల కోసం వచ్చాను. బిగ్ బాస్ హౌస్ లో పెద్దగా ఆడట్లేదు. అందుకే నేను అందులోకి వెళ్తున్నాను. నా తడాఖా ఏంటో హౌస్ లో చూపిస్తా అంటూ ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. బయట ఫైర్ మీద ఉండే మాధురి.. హౌస్ లో కూడా అలాగే ఉంటుందని అంటున్నారు నెటిజన్లు. ఆమె రాకతో బిగ్ బాస్ కు మరింత క్రేజ్ పెరుగుతోందని అంటున్నారు. ఇప్పటి వరకు చప్పగా సాగిన హౌస్.. ఆమె రాకతో రచ్చ రచ్చగా మారడం ఖాయం అంటున్నారు.

Learn Additionally : Bigg Boss 9 : తప్పు చేశాం.. పచ్చళ్ల పాప రమ్య మోక్ష కామెంట్స్