Published on Dec 1, 2024 2:00 AM IST
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా సుజీత్ – సందీప్ సంయుక్తంగా రూపొందించిన ‘క’ సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని, బాక్సాఫీస్ దగ్గర కూడా ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. అయితే, నవంబరు 28 నుంచి ఇది ఈటీవీ విన్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ఒక్క రోజులోనే ఈ చిత్రం 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో ఓటీటీలో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్రబృందం స్పెషల్ ప్రెస్‌మీట్ నిర్వహించింది.
ఈ స్పెషల్ ప్రెస్‌మీట్ లో ఈ సినిమా సక్సెస్ కాకపోతే సినిమాలు మానేస్తా అన్నారు. నిజంగానే అదే చేసేవారా? అని కిరణ్ అబ్బవరంని ప్రశ్నించగా.. ‘నేను మాట మీద నిలబడే మనిషిని’ అంటూ కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చాడు. కిరణ్ ఇంకా మాట్లాడుతూ.. ‘నిర్మాత చింతా గోపాలకృష్ణ మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేశారు. బడ్జెట్ విషయంలో ఆయన వెనకాడలేదు. మా చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులందరికి ధన్యవాదాలు. మా నమ్మకాన్ని మించి పెద్ద విజయాన్ని అందించారు’ అని కిరణ్ అబ్బవరం తెలిపారు.