అవైటెడ్ “గేమ్ ఛేంజర్” టీజర్ గ్రాండ్ లాంఛ్ వేదిక ఖరారు! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Dec 1, 2024 12:55 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ ‘గేమ్ ఛేంజర్’. జనవరి 10, 2025న థియేటర్లలోకి రానుంది. ఐతే, ఈ పొలిటికల్ డ్రామా నుంచి ‘నానా హైరానా’ సాంగ్ రిలీజైన విషయం తెలిసిందే. ఈ పాటపై లిరిసిస్ట్ రామ జోగయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘ఆమ్మో.. ఈ పాట ఇప్పట్లో ఆగదు. చాలా దూరం వెళ్తుంది. చాలా కాలం మోగుతూనే ఉంటుంది’ అని పోస్ట్ చేశారు.

కాగా మెగా అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. పైగా ఈ సంక్రాంతికి విడుదలవుతున్న భారీ చిత్రాల్లో ఈ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. మరో కీలక పాత్రలో అంజలి కనిపించనుంది. అన్నట్టు గేమ్ ఛేంజర్ నార్త్ ఇండియా థియేటర్స్ రైట్స్ ను అనిల్ తడాని యొక్క AA ఫిల్మ్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *