మైటీ ఒక్ పిక్చర్స్ బ్యానర్‌పై మనోహరి కెఎ నిర్మాతగా మున్నా కాశీ హీరోగా నటించి దర్శకత్వం వహించిన హర్రర్ థ్రిల్లర్ చిత్రం ‘సి 202’. ఈ మూవీ అక్టోబర్ 25న విడుదలై ఆరు వారాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలు మరియు ఇతర ప్రాంతాల్లో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. మరో వారంతో ఈ మూవీ 50 రోజుల మైలు రాయిని చేరుకుంటుంది.
ఈ సందర్భంగా హీరో దర్శకుడు మున్నా కాశీ మాట్లాడుతూ..‘సి 202 చిత్రం అక్టోబర్ 25న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయింది. మంచి రివ్యూస్ మరియు మౌత్ టాక్‌తో ప్రేక్షకుల ఆదరణ పొంది ఆరు వారాలుగా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఇప్పుడు మా చిత్రం ఏడో వారంలోకి ప్రవేశించింది. ఇప్పటికే 50 లక్షల షేర్ వసూళ్లు చేసింది. మరో వారం రోజుల్లో 50 రోజుల మైలురాయి చేరుకుంటుంది. మా సి 202 చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు మా ధన్యవాదాలు.’ అని తెలిపారు.
ఈ సినిమాలో షారోన్ రియా ఫెర్నాండెజ్, తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ, అర్చన తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
The post 50 రోజులకి చేరువలో ‘సి 202’ మూవీ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.