Published on Dec 3, 2024 5:01 PM IST
ప్రస్తుతం టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారిన ‘పుష్ప-2’ మూవీ రిలీజ్‌పై తెలంగాణలో చివరి నిమిషంలో అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ చిత్ర నిర్మాతలు టికెట్ రేట్లు అసాధారణంగా పెంచి సినిమాను రిలీజ్ చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ ప్రతిష్టాత్మకమైన సినిమా రిలీజ్‌కు మరికొన్ని గంటల వ్యవధి మాత్రమే ఉండగా, ఈ పిటీషన్‌తో అభిమానులు ఆందోళనకు గురయ్యారు.
అయితే, తాజాగా ఈ పిటీషన్‌పై హైకోర్టు స్పందించింది. చివరి నిమిషంలో సినిమా రిలీజ్‌ను అడ్డుకోవడం సాధ్యం కాదని.. ఈ పిటీషన్‌కు సంబంధించిన న్యాయపరమైన విచారణను రెండు వారాల తరువాత నిర్వహించాలని హైకోర్టు పేర్కొంది. దీంతో ‘పుష్ప 2’ మేకర్స్ ఊపిరిపీల్చుకున్నారు.
ఇలా భారీ బడ్జెట్ సినిమా రిలీజ్‌కు ముందర లీగల్ వివాదంలో చిక్కుకోవడంతో కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయనుండగా.. అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.