మంచి కంటెంట్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ‘క’ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌”క” సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 31న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ‌”క” సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ప్రెస్ మీట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో నిర్వహించారు.

ఈ సందర్భంగా హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ‘”క” సినిమాను ఈ నెల 31న దీపావళి పండుగ సందర్భంగా రిలీజ్ చేస్తున్నాం. ఈ నెల 31న రిలీజ్ చేయడానికి కారణం మా వంశీ నందిపాటి. ఆయన మూవీ చూసి మంచి ప్రైస్ ఇచ్చి సినిమా రిలీజ్ చేస్తున్నారు. మా అందరికీ “క” సినిమాపై నమ్మకం ఉంది. మా మూవీ టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కంటెంట్‌తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపి “క” సినిమాను థియేటర్స్‌లోకి తీసుకొస్తున్నాం. “క” సినిమాలో జాతర సాంగ్‌కు స్పెషల్ అప్లాజ్ వస్తోంది. ఈ నెల 22న ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాం. “క” సినిమాలో మా డైరెక్టర్స్ క్రియేట్ చేసిన విజువల్స్, సౌండింగ్ చాలా కొత్తగా ఉంటాయి.’ అని అన్నారు.

డైరెక్టర్ సందీప్ మాట్లాడుతూ.. ‘మా “క” సినిమా ఈ నెల 31న రిలీజ్‌కు వస్తుండటం హ్యాపీగా ఉంది. కథ విన్నప్పటి నుంచి మాకు కిరణ్ గారు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఏ విషయంలోనూ ఆయన ఇంటర్ ఫియర్ కాలేదు. మేము ఇమాజిన్ చేసుకున్నట్లు మూవీని రూపొందించాం. కథను తెరకెక్కించే క్రమంలో మేమంతా ఏం ఫీల్ అయ్యామో అదే థియేటర్ లో మీరు అనుభూతి చెందుతారు.’ అని అన్నారు.

డైరెక్టర్ సుజీత్ మాట్లాడుతూ..‘70 దశకం నేపథ్యంలో “క” సినిమా సాగుతుంది. అప్పట్లో మనకు సమాచారం ఇచ్చేది పోస్ట్ మ్యాన్. ఆ కాలంలో అభినవ్ వాసుదేవ్ అనే ఓ పోస్ట్ మ్యాన్ జీవితంలో జరిగే కథ ఇది. స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ ఇది. “క” సినిమా ఒక ప్రత్యేకమైన స్క్రీన్ ప్లేతో సాగుతుంది. మేము కథ చెప్పినప్పటి నుంచి కిరణ్ గారు ఈ క్యారెక్టర్ కోసం బాగా సన్నద్ధమయ్యారు. మీరు థియేటర్ లో సినిమా చూస్తున్నప్పుడు అభినయ వాసుదేవ్ మాత్రమే కనిపిస్తారు.’ అని అన్నారు.

ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ.. ‘మా “క” సినిమాను ఈ నెల 31న రిలీజ్ చేస్తున్నాం. మూవీ కంటెంట్ మీద పూర్తి నమ్మకం ఉంది. తప్పకుండా “క” సినిమా ప్రేక్షకాదరణ పొందుతుంది. ఈ నెల 30న ప్రీమియర్స్ వేయబోతున్నాం. పండుగకు నాలుగు రోజులు సెలవులు వస్తుండటం అడ్వాంటేజ్ అనుకుంటున్నాం. “క” సినిమా కంటెంట్ చూశాక నేను ఇచ్చింది తక్కువేనని అనిపించింది. ఈ నెల 31న మిగతా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. వారి మూవీస్ కూడా హిట్ కావాలి.’ అని అన్నారు.

The post మంచి కంటెంట్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ‘క’ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *