Published on Dec 5, 2024 1:00 PM IST
ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఓ రేంజ్ లో వినిపిస్తున్న ఒకే ఒక్క సినిమా పేరు “పుష్ప 2 ది రూల్”. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా సుకుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం ఇది కాగా ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో బ్లాస్టింగ్ రిలీజ్ కి వచ్చింది. అయితే సినిమాకి సాలిడ్ టాక్ వచ్చింది బన్నీ ఫ్యాన్స్ పండగ కూడా చేసుకుంటున్నారు.
కానీ ఈ సినిమా విషయంలో బన్నీ ఫ్యాన్స్ కి మేకర్స్ తన ఫ్యాన్స్ కే అని కాదు రీసెంట్ మూవీ లవర్స్ కి ఒక్క విషయంలోఓ మాత్రం డిజప్పాయింట్ చేసారని చెప్పాలి. ఈ మధ్య కాలంలో మన స్టార్ హీరోస్ కి తమ స్టార్ టైటిల్ కార్డు కానీ తమపై ఒక స్పెషల్ డిజైన్ తో కూడిన పేరుని క్రేజీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో పడుతున్నాయి.
మొన్ననే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి “దేవర” (Devara) కి అలాగే హీరో సూర్యకి “కంగువా” (Kanguva) కి హీరోలపై ఫ్యాన్స్ ని పిచ్చెక్కించే సాలిడ్ టైటిల్ కార్డ్స్ పడ్డాయి. కానీ ఇది మాత్రం పుష్ప 2 లో లేదు. చాలా అంటే చాలా సింపుల్ గా దీనిని తేల్చేసారు. దీనితో ఇది మాత్రం ఫ్యాన్స్ ని బాగా డిజప్పాయింట్ చేసింది అని చెప్పాలి. ఎన్నో అంచనాలు ఉన్న భారీ సీక్వెల్ ఇది. దీనికి కూడా ఇంత సింపుల్ గా వదిలేయడం ఒకింత నిరాశే అని చెప్పాలి.