యూఎస్ ప్రీమియర్స్ లో “పుష్ప 2” భారీ వసూళ్లు.. | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Dec 5, 2024 11:56 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “పుష్ప 2 ది రూల్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ పాన్ ఇండియా చిత్రం యూఎస్ మార్కెట్ లో అయ్యితే మొదటి నుంచి దూకుడు కనబరిచిన సంగతి తెలిసిందే.
అలా ఈ భారీ సినిమా సాలిడ్ వసూళ్లు జస్ట్ ప్రీమియర్స్ లోనే అందుకోగా ఇపుడు ఈ ప్రీ సేల్స్ తోనే పుష్ప రాజ్ ఏకంగా 3 మిలియన్ డాలర్ మార్క్ గ్రాస్ ని దాటించేసాడు. ఇలా రిలీజ్ కి ముందే పుష్ప 2 నార్త్ అమెరికాలో 3.2 మిలియన్ డాలర్స్ మార్క్ ని దాటి ఇంకా కొనసాగుతుంది. మరి డే 1 సహా ప్రీమియర్స్ కలిపి ఎంత వసూళ్లు వస్తాయి అనేది చూడాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ అలాగే సుకుమార్ రైటింగ్స్ నిర్మాణం వహించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *