అఫీషియల్: ఓరోజు ముందే “పుష్ప 2” వరల్డ్ వైడ్ టేకోవర్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Dec 6, 2024 2:00 AM IST

ప్రస్తుతం సినిమా లవర్స్ ‘పుష్ప-2’ మేనియాతో ఊగిపోతున్నారు. ఈ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనదైన పర్ఫార్మెన్స్‌తో థియేటర్లలో పూనకాలు తెప్పిస్తున్నాడు. ఇక సుకుమార్ టేకింగ్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమాలోని నటీనటులు తమ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని ప్రేక్షకులు కితాబిస్తున్నారు.

అయితే, ‘పుష్ప-2’ సినిమాను చూసిన చాలా మంది ఒక విషయంలో కాస్త నిరాశకు లోనవుతున్నారు. ‘పుష్ప-1’ మూవీలో జాలిరెడ్డి పాత్రలో డాలి ధనంజయ నటించి ఆకట్టుకున్నాడు. అయితే, ఆ సినిమాలో పుష్ప చేతిలో దెబ్బలు తిన్న జాలిరెడ్డి గాయాలతో మంచం పాలయ్యాడు. దీంతో పుష్ప-2 సినిమాలో జాలిరెడ్డి పాత్ర ఎప్పుడెప్పుడు కనిపిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూశారు.

కానీ, ఈ సినిమాలో జాలిరెడ్డి జాడ ఎక్కడా కనిపించలేదు. కేవలం క్లైమాక్స్‌లో ఓ సీన్‌లో జాలిరెడ్డి కనిపించాడు. కానీ, అతనికి ఒక్క డైలాగ్ కూడా లేదు. దీంతో జాలిరెడ్డి జాడే లేదని కొందరు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *