తెలుగులో “పుష్ప 2” భారీ ఈవెంట్ ఇక్కడే.. | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Dec 6, 2024 10:09 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం “పుష్ప 2 ది రూల్” మేనియా పాన్ ఇండియా లెవెల్లో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇలా ఒక్క తెలుగులోనే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా పుష్ప 2 భారీ ఓపెనింగ్స్ ని ప్రీమియర్స్ తోనే అందుకుంది. ఇలా డే 1 కి వచ్చేసిన ఈ సినిమా అక్కడ ఒక్క నార్త్ అమెరికా నుంచే 1 మిలియన్ డాలర్స్ గ్రాస్ ని డే 1 కి అందుకున్నట్టుగా చెబుతున్నారు.

దీంతో ఇప్పుడు వరకు పుష్ప 2 ఏకంగా 4.5 మిలియన్ డాలర్స్ మార్క్ ని దాటేసి 5 మిలియన్ దిశగా దూసుకెళ్తుంది. మరి ఈ సినిమా ఫైనల్ రన్ కూడా గట్టిగానే ఉండేలా ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్, రావు రమేష్, జగపతి బాబు, తారక్ పొన్నప్ప, సునీల్ తదితరులు నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మాణం వహించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *