మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని హీరోగా నటించిన చిత్రం “డబుల్ ఇస్మార్ట్” తో ఈ ఏడాది పలకరించిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాకపోవడంతో రామ్ కం బ్యాక్ కోసం ఇపుడు తన ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత తాను తన కెరీర్ 22వ సినిమా దర్శకుడు మహేష్ తో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
“మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి” తో సాలిడ్ డెబ్యూ అందుకున్న ఈ యువ దర్శకుడు కాంబినేషన్ లో రీసెంట్ గా అనౌన్స్ చేశారు. మరి దీని నుంచి రామ్ పై లేటెస్ట్ గా ఒక సూపర్ కూల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో రామ్ సాగర్ అనే పాత్రలో నటిస్తుండగా ఒక సైకిల్, దానితో ఒక సింపుల్ లుక్ లో రామ్ జోవియల్ గా కనిపిస్తున్నాడు. మరి ఈ సాగర్ మీలో ఒకడు అంటూ పోస్ట్ చేశారు. మరి ఈ సినిమా ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా షూటింగ్ పనులు జరుగుతున్నాయి.
The post సూపర్ కూల్ లుక్స్ తో రామ్ పోతినేని 22 ఫస్ట్ లుక్.. first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.