హీరో కిరణ్ అబ్బవరం (Kiran abbavaram) తన కొత్త సినిమాకు డిఫరెంట్ టైటిల్ పెట్టుకున్నారు. క (Ka) అనే టైటిల్ ను ఈ సినిమాకు ఈ రోజు అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్నారు. కొత్త దర్శకద్వయం సుజీత్, సందీప్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

క టైటిల్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో కిరణ్ అబ్బవరం బ్యాక్ నుంచి లుక్ రిలీజ్ చేశారు. టైటిల్ వెనక రాశులను చూపించారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో భారీ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా క సినిమా తెరపైకి రాబోతోంది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగుతో పాటు సౌతిండియన్ లాంగ్వేజెస్ అయిన తమిళ, మలయాళ, కన్నడలో రిలీజ్ చేయబోతున్నారు.