Published on Dec 6, 2024 8:03 PM IST
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి నార్త్ ఇండియా మార్కెట్ లో ఎప్పుడు నుంచో భారీ ఫాలోయింగ్ ఉంది అనే మాటని కేవలం యూట్యూబ్ వ్యూస్ వరకు మాత్రమే కాకుండా థియేటర్స్ లోకి జనాన్ని రప్పించి కూడా ఆల్రెడీ పుష్ప పార్ట్ 1 తో చూపించిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన “పుష్ప 2 ది రూల్” అయితే ఇపుడు అక్కడ ఒక హిస్టారికల్ ఓపెనింగ్స్ సాధించి చరిత్ర సృష్టించింది.
బాలీవుడ్ లో ఎప్పుడు నుంచో పాతుకుపోయిన బిగ్గెస్ట్ స్టార్స్ సెట్ చేసిన రికార్డులని సైతం పుష్ప రాజ్ భారీ మార్జిన్ తో ఎగరేసాడు. అలా ఏకంగా 72 కోట్ల ఓపెనింగ్స్ తో చరిత్ర సృష్టించి అల్లు అర్జున్ హిందీ హీరోలని మించిపోయాడు. మరి దీనితో పుష్ప 2 వెనకే మిగతా సినిమాలు ఉండగా ఇపుడు ఉన్న టాప్ 5 సినిమాల లిస్ట్ ఇలా ఉంది.
మొదటిగా టాప్ 1 స్థానంలో పుష్ప 2 కేవలం హిందీ వెర్షన్ లోనే 72 కోట్లకి పైగా వసూలు చేయగా టాప్ రెండో స్థానంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన “జవాన్” 65.5 కోట్ల నెట్ వసూళ్లతో ఉంది. ఇక దీనితో పాటుగా టాప్ 3 లో శ్రద్ధా కపూర్ “స్త్రీ 2” 55.4 కోట్లు, నెక్స్ట్ టాప్ 4 లో షారుఖ్ “పఠాన్” 55 కోట్ల నెట్, ఇక టాప్ 5లో రణబీర్, సందీప్ రెడ్డి వంగల “అనిమల్” చిత్రం 54.7 కోట్లతో నిలిచింది. ఇలా టాప్ 5 చిత్రాల్లో మొదటి స్థానం ఇపుడు పుష్ప 2 అందుకొని బిగ్గెస్ట్ రికార్డు నమోదు చేసింది.