కృష్ణవంశీ… సినిమాలకు ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన నిన్నే పెళ్లాడత, గులాబీ, చంద్రలేఖ, అంత:పురం, సింధూరం, సముద్రం, మురారి, ఖడ్గం,చందమామ, మహాత్మ, రాఖీ లాంటి అందమైన సినిమాలు తీయడం మాత్రమే కాదు.. అద్భుతమైన పాత్రలను క్రియేట్ చేయడంలోనూ మాస్టర్‌గా చెప్పవచ్చు. ఇక కృష్ణవంశీ  సినిమాల్లో పాటలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక చాలామంది ఆర్టిస్టులను సైతం వెండితెరకు పరిచయం చేశారు కృష్ణవంశీ. అందులో నటుడు సుబ్బరాజు గురించి మనం ప్రముఖంగా చెప్పుకోవాలి. ఆరడగుల కటౌట్.. హీరోల లాంటి ఫిజిక్.. అయినా ఎందుకో క్యారెక్టర్ ఆర్టిస్టుగానే సర్దుకుపోయాడు సుబ్బరాజు. ఇక సుబ్బరాజుకు తొలి సినిమా అవకాశం ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం…

అప్పట్లో ఎంసీఏ కంప్లీట్ చేసి డెల్ కంపెనీలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పనిచేస్తున్నాడు సుబ్బరాజు. ఏ యువకుడికైనా డెల్ లాంటి సంస్థలో ఉద్యోగం వస్తే తన లైఫ్ సెటిల్ అయిపోయినట్లే. అయితే సుబ్బరాజుకు మాత్రం.. సినిమాలపై ఆసక్తి ఉండేది. అయితే ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ పర్సనల్ మేనేజర్ వెంకట్.. సుబ్బరాజుకు ఫ్రెండ్ అట. ఓ సారి కృష్ణవంశీ పర్సనల్ కంప్యూటర్‌కు ఏదో ఇష్యూ వస్తే.. వెంకట్ సుబ్బరాజును తీసుకువెళ్లి సాల్వ్ చేయించారట. ఆ సందర్భంలో సుబ్బరాజుకు కృష్ణవంశీకి పరిచయం ఏర్పడింది. అప్పుడే సుబ్బరాజుకు సినిమాలపై ఆసక్తి ఉందని తెలుసుకున్న కృష్ణవంశీ సుబ్బరాజుకు.. తన తదుపరి సినిమా ఖడ్గంలో చిన్న టెర్రరిస్టు వేషం ఇచ్చారు. అలా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన  సుబ్బరాజు.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’లో నెగిటివ్ రోల్ చేశాడు. ఆ పాత్ర అతని జీవితాన్ని మార్చేసింది.  అతను ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన పనిరాలేదు. వందల సినిమాలు చేశాడు. అయితే ఎందుకో తెలీదు కానీ ఏడాది కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు సుబ్బరాజు.

Subbaraju

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.