ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా మన టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ చిత్రం “పుష్ప 2” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ అవైటెడ్ సీక్వెల్ మొదటి రోజే ఇండియన్ సినిమా రికార్డులు తిరగరాసింది. ఇలా టోటల్ ఇండియా వైడ్ గానే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా పుష్ప 2 కి భారీ వసూళ్లు మొదటి రోజు నమోదు అయ్యాయి.
ఇలా నైజాంలో కూడా సెన్సేషనల్ నెంబర్స్ తో ఆల్ టైం రికార్డు నమోదు చేయగా ఇపుడు డే 1 వసూళ్లు తెలుస్తున్నాయి. మరి లేటెస్ట్ పి ఆర్ నంబర్స్ ప్రకారం డే 2 పుష్ప నైజాం ప్రాంతంలో సుమారు 9 కోట్ల మేర షేర్ జి ఎస్ టి కాకుండా వసూలు చేసిందట. ఇలా డే 2 కూడా పుష్ప 2 సాలిడ్ నంబర్స్ ని అందుకుంది అని చెప్పాలి. ఒక వర్కింగ్ డే లో ఇది మంచి నెంబర్ అని చెప్పొచ్చు. ఇక వీకెండ్ లో అయితే మరింత లెవెల్లో వసూళ్లు ఉండబోతున్నాయని కూడా చెప్పాలి.
The post నైజాంలో “పుష్ప 2” డే 2 వసూళ్లు.. first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.