పుష్ప మూవీ సెకండ్ పార్ట్ డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ లభించింది. మధ్యలో మిక్స్డ్ టాక్ వచ్చిన సరే కలెక్షన్స్ విషయంలో మాత్రం ఏ మాత్రం తగ్గేదే లేదు అన్నట్టు దూసుకుపోతోంది. మొదటి రోజు 294 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా రెండోరోజు 449 కోట్లు సాధించినట్లు సినిమా యూనిట్ అధికారికంగా ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. అయితే కొద్దిసేపటి తర్వాత నిర్వహించిన సినిమా సక్సెస్ ప్రెస్ మీట్లో మాత్రం ఈ సినిమా ఏకంగా 500 కోట్లు క్రాస్ చేసినట్లు నిర్మాతలలో ఒకరైన ఎలమంచిలి రవిశంకర్ వెల్లడించారు.
Allu Arjun: కళ్యాణ్ బాబాయ్ థాంక్యూ.. అల్లు అర్జున్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు
ఈ ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలోనే పలువురు డిస్ట్రిబ్యూటర్ల నుంచి తనకు మెసేజ్లు వచ్చాయని మీరేదో పొరపాటు పడినట్టున్నారు మాకు ఉన్న అంచనాల ప్రకారం 500 కోట్లు దాటేసినట్లు వాళ్లు చెప్పడంతో సినిమా రెండో రోజు 500 కోట్లు క్రాస్ చేసినట్లు ఆయన ప్రకటించారు. అలాగే ఇండియన్ హిస్టరీలో అత్యంత త్వరగా 500 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా ఈ సినిమా రికార్డులకు ఎక్కినట్లు మరో నిర్మాత నవీన్ ప్రకటించారు. ఇక రేపు ఆ తర్వాత ఎల్లుండి రెండు వీకెండ్ కావడంతో ఈ సినిమాకి సంబంధించిన బుకింగ్స్ మరింత ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నిర్మాతలు మాట్లాడుతూ మాకున్న అంచనాలను కూడా ఈ సినిమా ఖచ్చితంగా దాటేసే సూచనలు కనిపిస్తున్నాయి. మేము ఒక లెక్క వేసుకున్నాం దానికి మించి సినిమా ముందుకు దూసుకు వెళ్తుంది అంటూ ఆయన పేర్కొన్నారు.