Published on Dec 8, 2024 2:00 AM IST
ఐటెం సాంగ్స్‌కి ఉండే ఆదరణ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఓ సినిమాలో స్టార్ హీరో, స్టార్ హీరోయిన్, స్టార్ డైరెక్టర్ చేయలేని పని ఓ ఐటెం సాంగ్ చేస్తుందా… అంటే కొన్ని సందర్భాల్లో అవుననే చెప్పాలి. ఇలా టాలీవుడ్లో చాలా ఐటెం సాంగ్స్ సినిమాలను బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్స్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే, టాలీవుడ్లో రీసెంట్గా వచ్చిన ఐటెం సాంగ్ ‘కిస్సి్క్’ పుష్ప-2 సినిమాకు బోనస్‌గా నిలిచిందని చెప్పాలి.
ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్నకు ఎలాంటి పేరు వచ్చిందో.. ఐటెం సాంగ్ ‘కిస్సిక్’తో యంగ్ బ్యూటీ శ్రీలీలకు కూడా అంతే పేరు వచ్చింది. అయితే, ఈ సాంగ్ చేయడంతో శ్రీలీల ఇప్పుడు ఓ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘కిస్సిక్’ సాంగ్ తన కెరీర్లోనే తొలి ఐటెం సాంగ్ కావడమే కాకుండా.. చివరి ఐటెం సాంగ్ కావాలని ఆమె చూస్తుందట. కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు ఇలా ఐటెం సాంగ్స్ చేయడంతో ఆదాయం వస్తుందని.. అయితే, అవకాశాలు కూడా ఐటెం సాంగ్ వరకే వస్తాయని ఆమె భావిస్తుందట.
దీంతో ఇకపై తనదగ్గరకు ఎవరైనా ఐటెం సాంగ్స్ చేయాలని వస్తే, నిర్మొహమాటంగా నో చెప్పాలని ఫిక్స్ అయ్యిందట. ఏదేమైనా ఒక్క సాంగ్‌తోనే ‘ఐటెం గర్ల్’ అనే పేరును తనకు రాకుండా ఉండేలా శ్రీలీల భావిస్తున్నట్లు తెలుస్తోంది.