- మంచు కుటుంబంలో విభేదాలు
- మోహన్ బాబుపై కేసు పెట్టిన మనోజ్
- తిరిగి మనోజ్ పై కేసు పెట్టిన మోహన్ బాబు
మోహాన్ బాబు అంటే క్రమశిక్షణ. క్రమశిక్షణ అంటే మోహన్ బాబు అంటే పేరుంది. అంతటి మోహన్ బాబు కుటుంబంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు వివాదాస్పదంగా మారుతుంది. ఆ మధ్య మంచు బ్రదర్స్ వ్యవహారం సంచలనం రేకిత్తించింది, మంచు మనోజ్ పై మంచు మనోజ్ దాడి చేస్తున్న వీడియోను రిలీజ్ చేస్తూ అర్ధరాత్రి ఇలా ఇంటికి వచ్చిబెదిరిస్తున్నాడు అని మనోజ్ వాపోయాడు. ఈ వివాదం అప్పట్లో సంచలం రేపింది. అన్నదమ్ముల మధ్య ఆస్తుల పట్ల చిన్న చిన్న వివాదాలు సహజం అని మోహన్ బాబు కొట్టిపారేసాడు.
కాగా మరోసారి మంచు కుటుంబం వ్యవహారం హాట్ టాపిక్ మారింది. ఈ దఫా తండ్రి కొడుకులు ఒకరిమీద ఒకరు కేసులు వరకు వెళ్ళింది. వివరాలలోకెళితే మోహన్ బాబుపై తనను కొట్టాడని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు మంచు మనోజ్. తగిలిన గాయాలతో పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు. తన భార్య మౌనికపై కూడా దాడి చేసారని ఆరోపించాడు మనోజ్. అయితే మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై ఫిర్యాదు చేశాడు మోహన్ బాబు. స్కూల్, ఆస్తుల వ్యవహారంలో గత కొద్దీ రోజులుగా వీరి మధ్య వివాదం నడుస్తుండగా ఇప్పుడు పరస్పర దాడులు వెళ్లినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పహాడీ షరీఫ్ పోలిసులు విచారణ చేస్తున్నారు.