Published on Dec 8, 2024 2:00 PM IST
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప 2 ది రూల్’ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రికార్డుల వేటలో సరికొత్త చరిత్రను తిరగరాస్తుంది. మొదటి మూడు రోజుల్లోనే బాక్స్‌ఫీస్ డైనోసార్‌గా ఆవిర్భవించిన ఈ సినిమా.. మరిన్ని రికార్డులను బద్దలు కొట్టేలా కనిపిస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ పుష్ప 2 గురించి ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.
ఇంతకీ, తరణ్ ఆదర్శ్ పెట్టిన పోస్ట్ ఏమిటంటే.. ‘ఇది ఒక సునామీ – హరికేన్ – టైఫూన్… మొత్తంగా ‘పుష్ప 2’ చరిత్రను తిరగరాస్తుంది. ఇప్పటికే, బాక్స్‌ఫీస్ డైనోసార్‌గా ఆవిర్భవించింది, రికార్డు పుస్తకాలలో నిలిచిన ప్రతి రికార్డును ఈ సినిమా బద్దలు కొడుతోంది. ఇది నిజం అని శనివారం నాడు వచ్చిన కలెక్షన్సే రుజువు చేశాయి. రిలీజ్ మొదటి రోజే కాకుండా, మూడో రోజు నాడు కూడా ₹ 70 కోట్ల మార్కును అధిగమించిన మొదటి హిందీ చిత్రం ‘పుష్ప 2′.
కాగా రిలీజ్ రోజు [గురువారం], అలాగే మూడవ రోజు [శనివారం] పుష్ప 2 సరికొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పింది. పుష్ప2 గురువారం నాడు 72 కోట్లు, శుక్రవారం నాడు 59 కోట్లు, శనివారం నాడు 74 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. మొత్తం మూడు రోజులకు గానూ ₹ 205 కోట్లు కలెక్ట్ చేసింది ఈ చిత్రం’ అంటూ తరణ్ ఆదర్శ్ తన పోస్ట్ లో రాసుకొచ్చాడు.
IT’S A TSUNAMI – HURRICANE – TYPHOON… ‘PUSHPA 2’ REWRITES HISTORY *ONCE AGAIN*… #Pushpa2 emerges as a BOXOFFICE DINOSAUR, smashing every record that stands tall in the record books… The Saturday numbers prove it.#Pushpa2 is the first #Hindi film to surpass the ₹ 70 cr… pic.twitter.com/lufoMo9VO8
— taran adarsh (@taran_adarsh) December 8, 2024