కల్కి సినిమా ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా కలెక్షన్ల సునామీని సృష్టించింది. కల్కి చిత్రం ఉత్తర అమెరికాలో రికార్డులు సృష్టించింది మరియు కెనడాలో కూడా గొప్ప రికార్డును సృష్టించింది. ఒక్క కెనడాలోనే $3 మిలియన్లకు పైగా వసూలు చేసింది. ఈ ఘనత సాధించిన తొలి సినిమాగా చరిత్ర సృష్టించింది.

ఇకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబు కల్కి సినిమాపై ట్వీట్ చేశారు. ఈ సినిమాపై ఆయన సదరు ట్వీట్‌లో పొగిడారు. ఇటీవలే కల్కి చిత్రాన్ని వీక్షించిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఇలా ట్వీట్ చేశారు: “కల్కి చిత్రం అద్భుతంగా ఉంది. వావ్” అని మహేష్ తన ట్వీట్‌లో చిత్ర దర్శకుడు నాగీ విజన్‌కు హ్యాట్స్ఆఫ్ చెప్పారు.

అంతేకాకుండా అమితాబ్, కమల్, ప్రభాస్, దీపిక కూడా నటనను మెచ్చుకుంటూ మళ్లీ ట్వీట్లు చేశారు. మరి ఇప్పటికే వెయ్యి కోట్లకు చేరువలో ఉన్న ఈ సినిమా ఇంకెన్ని కలెక్షన్స్ తో ముందుకు పోతుందో చూడాలి.