ప్రపంచ వ్యాప్తంగా కల్కి సినిమా విడుదలైంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సలార్ సినిమా తర్వాత కల్కి సినిమాతో మరో హిట్ అందుకున్నాడు ప్రభాస్. ముందు నుంచి అనుకుంటున్నట్టే ఈ సినిమా సంచలన విజయం దిశగా దూసుకుపోతుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు అన్ని ఏరియాలనుంచి బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది. ఈ సినిమా విడుదలకి ముందు నుంచే ట్రైలర్, టీజర్, పోస్టర్ సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. ఈ  అదరగొట్టేశాడు. చాలా రోజుల తర్వాత డార్లింగ్ తన కామెడీతో ఆకట్టుకున్నాడు. అలాగే యాక్షన్ సీన్స్ లోనూ అదరగొట్టాడు రెబల్ స్టార్. ఇదిలా ఉంటే కల్కి సినిమాకు పార్ట్ 2 కూడా ఉండనుంది. కల్కి సినిమా క్లైమాక్స్ లో ఈ సినిమా పార్ట్ 2 గురించి హింట్ ఇచ్చాడు నాగ్ అశ్విన్.

అసలు కల్కి కథ పార్ట్ 2లోనే ఉండబోతుందని తెలుస్తోంది. సినిమా చివరిలో కల్కి సినిమాటిక్ యూనివర్స్ అని ప్రకటించాడు దర్శకుడు. అలాగే రిలీజ్ కు ముందు లైవ్ లో మాట్లాడుతూ.. కల్కి పార్ట్ 2 గురించి మాట్లాడాడు నాగ్ అశ్విన్. కల్కి పార్ట్ 2 గురించి నిన్న ప్రభాస్ – నాగ్ అశ్విన్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్ లో మాట్లాడారు. ప్రభాస్ ఈ లైవ్ లో మాట్లాడుతూ.. పది రోజుల్లో మళ్ళీ కల్కి 2 వర్క్ మొదలుపెట్టాలి కదా వెళ్లి రెస్ట్ తీసుకో అని అన్నారు.

ఇది కూడా చదవండి : రామ్ చరణ్‌ పక్కన ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా.? టాలీవుడ్‌లో చాలా ఫెమస్ ఆమె

దాంతో కల్కి పార్ట్ 2 ఉంటుందని అర్ధమైపోయింది. అయితే ఆల్రెడీ సినిమా బేసిక్ కథను రెడీ చేశారని.. ఎలాగో సెట్స్, లొకేషన్ అన్ని లాక్ చేసి ఉన్నారు కాబట్టి పార్ట్ 2 షూటింగ్ కూడా కొంతమేర కంప్లీట్ చేశారని టాక్ వినిపిస్తుంది. అలాగే కల్కి పార్ట్ 2 ఇప్పట్లో రిలీజ్ అవ్వదని కూడా టాక్ వినిపిస్తుంది. దాదాపు మూడు ఏళ్ల తర్వాత ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ సలార్ 2, రాజా సాబ్, స్పిరిట్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలన్నీ కంప్లీట్ ఆయిన తర్వాత కల్కి 2 ఉండే అవకాశం ఉంది. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ కుష్ అవుతున్నారు.

ఇది కూడా చదవండి :చనిపోతూ ఎమ్మెస్ నారాయణ కోరిన చివరి కోరిక అదే.. గుండె బద్దలయ్యేలా ఏడ్చిన బ్రహ్మానందం..

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..