మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇపుడు యువ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “విశ్వంభర” కోసం అందరికీ తెలిసిందే. మరి తన నుంచి చాలా కాలం తర్వాత మళ్ళీ స్ట్రైట్ సినిమాగా వస్తున్న ఈ చిత్రం పట్ల మెగా ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత కూడా మెగాస్టార్ నుంచి క్రేజీ లైనప్ ఉండగా రీసెంట్ గానే యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో అనౌన్స్ చేసిన భారీ చిత్రం కూడా ఒకటి.
మరి ఈ చిత్రం తర్వాత తన లైనప్ లో మళ్ళీ “వాల్తేరు వీరయ్య” కాంబినేషన్ కూడా ఉన్నట్టుగా ఇపుడు బజ్ వినిపిస్తుంది. దర్శకుడు బాబీ కొల్లితో వాల్తేరు వీరయ్య భారీ హిట్ అయ్యి ఎలాంటి లాభాలు అందించిందో తెలిసిందే. అలాంటిది మళ్ళీ ఈ కాంబినేషన్ అంటే అంచనాలు మరిన్ని ఉంటాయి అని చెప్పాలి. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.
The post “వాల్తేరు వీరయ్య” కాంబినేషన్ పై క్రేజీ బజ్.. first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.