కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు శివ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “కంగువా” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం వాటిని అందుకోవడంలో మాత్రం విఫలం అయ్యింది. మరి దీనికి చాలా కారణాలే వినిపించాయి కానీ సినిమా మాత్రం కంప్లీట్ ప్లాప్ టాక్ మాత్రం ఎక్కడా తెచ్చుకోలేదు.
అయినప్పటికీ నష్టాలే చూసిన ఈ చిత్రం ఇపుడు కేవలం మూడు వారాల్లోనే ఓటిటిలో వచ్చేసింది. ఈ చిత్రంని ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం నేటి నుంచి స్ట్రీమింగ్ కి వచ్చింది. అయితే ఈ సినిమా థియేటర్స్ లో వెర్షన్ కి కొత్తగా వచ్చిందట.
థియేటర్స్ లో చూసిన చాలా సీన్స్, ఓ సాంగ్ ని కూడా కట్ చేసి ఇపుడు ఓటిటిలోకి వచ్చిందట. ఫస్టాఫ్ లో సహా సెకండాఫ్ లో కొన్ని సీన్స్ ని కట్ చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే ఫస్టాఫ్ లో సూర్య, దిశా పటాని సాంగ్ ని కత్తిరించారట. ఇలా ఓవరాల్ గా 12 నిమిషాలు మేర సినిమా కట్ అయ్యే వచ్చిందట. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా స్టూడియో గ్రీన్ అలాగే యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.
The post ఇంట్రెస్టింగ్.. ఓటీటీలో “కంగువా” కొత్త వెర్షన్ తో first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.