DaakuMaharaaj : డాకు మహారాజ్ డబ్బింగ్ పూర్తి .. బాబీకి బాలయ్య ప్రశంసలు

  • షూటింగ్ ఫినిష్ చేసిన డాకు మహారాజ్
  • సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల
  • అమెరికాలో డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘డాకు మహారాజ్’. భారీ బడ్జెట్ పై హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాకు శ్రద్దా శ్రీనాధ్ హీరోయిన్ గా నటిస్తుండంగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో సరికొత్త బాలకృష్ణను చూస్తారని యునిట్ నమ్మకంగా చెబుతోంది. కొద్దీ రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ ముగించి గుమ్మడి కాయ కొట్టిన మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసారు.

కాగా ఈ సినిమాను జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్ర హీరో నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించి డబ్బింగ్ ఫినిష్ చేసారు. అయితే మొత్తం సినిమా చూసుకుని డబ్బింగ్ ఫినిష్ అయ్యాక డాకు మహారాజ్ టీమ్ ను అభినందిచారట. అలాగే డైరెక్టర్ బాబీని ప్రత్యేకంగా అప్రిషియేట్ చేశారట బాలయ్య. అఖండ ఎంతటి లెవల్ లో ఉందో అదే రేంజ్ లో ఈ సినిమా ఉందని బాబీకి కంగ్రాట్స్ చెప్పారని తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను ఈ నెల 15న తర్వాత మొదలు పెట్టనున్నారు. జనవరి నూతన సంవత్సరం కానుకగా ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. అలాగే జనవరి 4న అమెరికాలో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు ఇటు అమరావతి లోను భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలనీ నిర్మాత నాగవంశీ ప్లాన్ చేస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *