డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్ ట్రెండ్ రావడంతో ఇతర భాషల హీరోలంతా తెలుగులో ఫేమ్ అవుతున్నారు. ఓటీటీల్లో ఇలాంటి హీరోలదే హవా నడుస్తోంది. ఇలా మన దగ్గర పేరు తెచ్చుకున్న మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ (Fahad faasil). పుష్ప (Pushpa) లో విలన్ గా నటించాక ఇతని సినిమాలకు ఓటీటీలో క్రేజ్ ఏర్పడింది. ఫహాద్ కొత్త సినిమా ధూమమ్ (Dhoomam) ఆహాలో స్ట్రీమింగ్ కు వచ్చింది.

నేటి నుంచి ధూమమ్ సినిమా ఆహా(Aha telugu)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ (Hombale films) నిర్మించింది. పవన్ కుమార్ (Pawan kumar) దర్శకత్వం వహించారు. థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ధూమమ్ సినిమాలో అపర్ణ బాలమురళి (Aparna balamurali) హీరోయిన్ గా నటించింది. థియేటర్స్ లో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ధూమమ్ టీమ్ ఓటీటీ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తోంది.