విలన్ పాత్రల పై విలక్షణ నటుడు క్రేజీ కామెంట్స్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Dec 9, 2024 1:59 PM IST

విలక్షణ నటుడిగా మనోజ్‌ బాజ్‌పేయీకి మంచి పేరు ఉంది. బాలీవుడ్‌ లో తనకంటూ ఓ మార్క్ ను క్రియేట్ చేసుకున్న మనోజ్‌ బాజ్‌పేయీ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లైఫ్ గురించి, అలాగే తన కెరీర్ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. తన ఫ్యామిలీ గురించి మనోజ్‌ బాజ్‌పేయీ మాట్లాడుతూ.. ‘నేను బీహార్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఒక రైతుకి పుట్టాను. ఓ రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను, ఈ రోజు స్థాయిలో ఉండడానికి ఎంతో మొండిగా, ధైర్యంగా ఉండాల్సి వచ్చింది’ అని చెప్పుకొచ్చాడు.

మనోజ్‌ బాజ్‌పేయీ తన కెరీర్‌ గురించి మాట్లాడుతూ.. ‘నా కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా ‘సత్య’. ఆ సినిమాలో భికూ మాత్రే పాత్ర నాకు లైఫ్ ను ఇచ్చింది. ఆ సినిమా తర్వాత నాకు అవకాశాలు పెరిగాయి. కానీ వచ్చిన అవకాశాలన్నీ విలన్ గానే. అందుకే ఆ మూస ధోరణి విలన్ పాత్రలకి ఫుల్‌స్టాప్‌ పెట్టాను. ఆ సమయంలో అలాంటి విలన్ పాత్రలు చేయడానికి నాకు ఎక్కువ డబ్బును ఆఫర్‌ చేశారు దర్శకనిర్మాతలు. వారితో ఒక్కటే చెప్పా. నేను సినిమా ఇండస్ట్రీలో విలన్‌గా ఉండాలనుకోవట్లేదు అని క్లారిటీ ఇచ్చాను. అప్పుడు ఆ పాత్రలు చేయలేదు కాబట్టే.. ఇప్పుడు నాకంటూ ఓ మార్క్ ను క్రియేట్ చేసుకోగలిగాను’ అంటూ మనోజ్‌ బాజ్‌పేయీ తెలిపాడు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *