ప్రముఖ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ ఇటీవల అత్యాచార ఆరోపణలను ఎదుర్కొన్నాడు. ఈ అంశంపై ఆయన జైలుకి కూడా వెళ్లాడు. అయితే, బెయిల్‌పై జానీ మాస్టర్ బయటకొచ్చిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా మరోసారి జానీ మాస్టర్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు. డ్యాన్సర్స్ యూనిట్ నుండి జానీ మాస్టర్ని తొలగించినట్లుగా మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
దీంతో ఈ వార్తలపై జానీ మాస్టర్ ఓ వీడియోతో తాజాగా క్లారిటీ ఇచ్చాడు. ‘డ్యాన్సర్ యూనియన్‌లో నుండి తనను ఎవరు తీసేయలేదని.. కొన్ని ఛానల్స్ మాత్రం ఇతరులను బాధించే విధంగా వార్తలు ప్రచారం చేస్తున్నాయని.. పనిని, ట్యాలెంట్‌ని ఎవరూ ఆపలేరని.. త్వరలోనే మంచి సాంగ్‌తో వస్తున్నానని.. తనకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’ అంటూ జానీ మాస్టర్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇక త్వరలోనే ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో ఓ పాటతో మనముందుకు రాబోతున్నాడట ఈ కొరియోగ్రఫర్. ఇలా జానీ మాస్టర్ ఫేక్ న్యూస్‌పై రెస్పాండ్ కావడంతో సదరు వార్తలకు చెక్ పడిందని చెప్పాలి.
నిర్ధారణవ్వని ఆరోపణలని కారణంగా చూపిస్తూ నన్ను శాశ్వతంగా యూనియన్ నుండి తొలగించినట్టు మీడియాలో పుకార్లు పుట్టిస్తున్నారు. అవేవీ నమ్మకండి!!
నా పదవీ కాలం ఇంకా ఉన్నా కూడా అనధికారికంగా, అనైతికంగా ఎలక్షన్లు నిర్వహించి వారికి వారే నిర్ణయాలు, హోదాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదు. దీనికి… pic.twitter.com/qroJxE5Uxv
— Jani Master (@AlwaysJani) December 9, 2024
The post డ్యాన్సర్స్ యూనియన్ నుండి తొలగింపుపై జానీ మాస్టర్ క్లారిటీ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.