మొత్తనికి ఓటీటీలో వచ్చేసిన “తంగలాన్” | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Dec 10, 2024 7:06 AM IST

కోలీవుడ్ విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా మాళవిక మోహనన్ సాలిడ్ పాత్రలో దర్శకుడు పా రంజిత్ తెరకెక్కించిన భారీ చిత్రం “తంగలాన్” కోసం తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ చిత్రం కొన్ని నెలల కితం రిలీజ్ కి వచ్చింది. అయితే ఈ సినిమా అనుకున్న రేంజ్ సక్సెస్ కాలేదు కాని చిత్ర యూనిట్ కష్టానికి మంచి మార్కులు పడ్డాయి.

కానీ అప్పుడు నుంచి ఈ సినిమా ఓటీటీలో అయితే ఇంకా రాలేదు. మరి ఫైనల్ గా ఇన్ని నెలలు తర్వాత ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమా హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా నేటి నుంచి ఇందులోనే ఈ చిత్రం దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ కి రావడం జరిగింది. ఇక ఈ చిత్రానికి జివి ప్రకాశ్ కుమార్ సంగీతం అందించగా లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *